WTC Final: టీమిండియా తుది జట్టు ఖరారు
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 01:49 IST

WTC Final: టీమిండియా తుది జట్టు ఖరారు

సౌథాంప్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ కాగా.. అజింక్యా రహానె వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగబోతోంది. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ఇద్దరూ బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండటంతో మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో వారికి చోటు కల్పించింది.  భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

భారత్‌ జట్టు: 

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె (వై.కె) రిషభ్‌ పంత్‌(వి.కీ), రవీంద్ర జడేజా, అశ్విన్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని