Dhoni: ధోనీ కొత్త లుక్‌ అదిరింది.. సోషల్‌మీడియాలో వైరల్‌!

తాజా వార్తలు

Published : 19/08/2021 22:40 IST

Dhoni: ధోనీ కొత్త లుక్‌ అదిరింది.. సోషల్‌మీడియాలో వైరల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆటలోనే కాదు ఆహార్యంలోనూ స్టయిలిష్‌గా కనిపించే ధోనీ.. హెయిర్‌ స్టయిల్‌ పట్ల ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటాడు. కెరీర్‌ తొలినాళ్లలో జులుపాలతో ఉన్న ధోనీ ఆ తర్వాత స్టయిల్‌ మారుస్తూ వస్తున్నాడు. ఒక్కో స్టయిల్‌ అదిరిపోయేలా ఉండడంతో యువత సైతం ధోనీ స్టయిల్‌ అంటూ హెయిర్‌ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్ బై చెప్పినా.. స్టయిల్‌ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్‌ స్టయిల్స్‌ మారుస్తూ ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నాడు.

ఇటీవల ‘ఫంకీ’ హెయిర్‌ స్టయిల్‌తో కుర్రకారును తెగ ఆకర్షించిన ధోనీ.. ఇప్పుడు మరో కొత్త లుక్‌లో రాయల్‌గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్‌ స్పోర్ట్స్‌ ధోనీ న్యూ లుక్‌కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘‘ఐపీఎల్‌కు ముందు ధోనీ కొత్తదనాన్ని పొందాడు. అసలైన సినిమా ఇంకా మిగిలే ఉంది. వేచి ఉండండి’’ అనే వ్యాఖ్యను జతచేసింది. ఇందులో ‘మిస్టర్‌ కెప్టెన్‌ కూల్‌’ స్పాంకీ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోను చూసిన అతని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇక బయోబుడగలో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 14 సీజన్‌ అర్ధంతరంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో జరగనున్నాయి. ఇందు కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటినుంచే బయోబుడగలు ఏర్పాటు చేస్తున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని