SRH జెర్సీలో వార్నర్‌కు ఇదే ఆఖరి సీజన్‌!

తాజా వార్తలు

Published : 04/05/2021 01:08 IST

SRH జెర్సీలో వార్నర్‌కు ఇదే ఆఖరి సీజన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో ఏదో జరుగుతోందని ఆ జట్టు మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ అనుమానం వ్యక్తం చేశాడు. అవేంటో బయటి ప్రజలకు తెలియడం లేదని పేర్కొన్నాడు. బహుశా ఆరెంజ్‌ ఆర్మీ జెర్సీలో డేవిడ్‌ వాార్నర్‌ను చూడటం ఇదే చివరిసారి కావొచ్చన్నాడు. సారథ్యం నుంచి తొలగించిన అతడికి రాజస్థాన్‌ మ్యాచులో తుది జట్టులోనూ చోటివ్వకపోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసిన సంగతి తెలిసిందే.

‘యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను డేవిడ్‌ వార్నర్‌ ప్రశ్నించాడో లేదో నాకైతే తెలియదు. మనీశ్‌ పాండేను తుది జట్టులోంచి తొలగించడం అతడి నిర్ణయం కాదని తెలుస్తోంది. కొన్నిసార్లు యాజమాన్యాలు ఇలాంటివి సహించవు. నాయకుడికీ జట్టుపై అధికారం ఉంటుంది. ఎవరిని జట్టులోకి తీసుకోవాలి వంటి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ కొన్నిసార్లు ఆ అధికారం వారి చేతుల్లోంచి పోతుంది’ అని స్టెయిన్‌ అన్నాడు.

‘చూస్తుంటే నాలుగు గోడల మధ్య ఏదో జరిగే ఉంటుంది. బహుశా అది ప్రజలకు తెలియదు. అయినప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవడం విచిత్రం. వచ్చే సీజన్‌కు వారు నాయకత్వ మార్పును కోరకుంటున్నారేమోనని అర్థం చేసుకోవచ్చు. కానీ అతడో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌. బహుశా వార్నర్‌ ఆరెంజ్‌ ఆర్మీ జెర్సీలో కనిపించడం ఇదే చివరి సారి కావొచ్చని అనుకుంటున్నా’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. 2013-2017 మధ్య హైదరాబాద్‌కు స్టెయిన్‌ 37 మ్యాచులు ఆడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని