close

తాజా వార్తలు

Updated : 19/01/2021 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీని అధిగమించి పంత్ కొత్త‌ రికార్డు.. 

టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌‌ రిషభ్‌ పంత్‌ టెస్టు క్రికెట్‌లో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి చెందిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టుల్లో భారత వికెట్‌ కీపర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అజింక్య రహానె(24) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్‌ (89*).. కమిన్స్‌ వేసిన 58.3వ ఓవర్‌కు రెండు పరుగులు తీసి ఈ ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల మైలురాయి చేరుకున్నాడు. అతడికిది 27వ ఇన్నింగ్స్‌ కావడం విశేషం. అంతకుముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. పంత్‌ ఇప్పుడు దాన్ని అధిగమించాడు. ఇక తర్వాతి స్థానాల్లో ఫరూక్‌ ఇంజినీర్‌ (36), వృద్ధిమాన్‌ సాహా (37), నయన్‌ మోంగియా (39) ఉన్నారు.

ఇదిలా ఉండగా, పంత్‌ 2018లో టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే సీజన్‌లో ఇంగ్లాండ్ (114)‌, ఆస్ట్రేలియా (159*) పర్యటనల్లో శతకాలు బాదాడు. ఆ అనుభవంతోనే ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికయ్యాడు. మరోవైపు సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ పంత్‌ 97 పరుగులతో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో తృటిలో శతకం చేజార్చుకున్నా తన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ఆటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. ఇక ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 27 ఇన్నింగ్స్‌ల్లో 2 శతకాలు, 4 అర్ధశతకాలతో కొనసాగుతున్నాడు.

ఇవీ చదవండి..
భారత్‌ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ

భారత్‌ చిరస్మరణీయ విజయం..



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని