Tokyo Olympics: పతకం రాకపోతేనేం.. చరిత్ర సృష్టించావు అదితి..!

తాజా వార్తలు

Updated : 07/08/2021 11:47 IST

Tokyo Olympics: పతకం రాకపోతేనేం.. చరిత్ర సృష్టించావు అదితి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్నప్పటికీ అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందించారు. గోల్ఫ్‌లో భారత్‌ను సరికొత్త శిఖరాలను చేర్చావంటూ కొనియాడారు. 

* టోక్యో ఒలింపిక్స్‌లో మరో భారత పుత్రిక తనదైన ముద్ర వేసింది. అదితి అశోక్‌ నువ్వు గొప్ప ప్రదర్శన చేశావు. ఈ రోజు నీ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత గోల్ఫింగ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లావు. అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నీకు అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

* బాగా ఆడావు అదితి. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించావు. పతకం తృటిలో తప్పిపోయి ఉండొచ్చు కానీ ఈ ఆటలో ఏ భారతీయుడు చేరుకోలేనంత దూరం వెళ్లావు. ఆ దారిలో మెరిశావు. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా - ప్రధాని మోదీ

* ఒలింపిక్‌ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత తొలి మహిళా గోల్ఫర్‌. టోక్యోలో అద్భుత ప్రదర్శన చేసిన అదితి అశోక్‌కు స్టాండింగ్ ఒవేషన్‌ దక్కుతుంది. చివరి వరకు ఎంతో గొప్పగా ఆడావు. చరిత్ర సృష్టించావు - క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

* గోల్ఫ్‌ కోటపైకి దూసుకెళ్లి బారత్‌ను కొత్తగా చూపించింది. ఈ ఆట భవిష్యత్తుపై దృష్టిపెట్టేలా మాపై ఒత్తిడి పెంచినందుకు కృతజ్ఞతలు - ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా

* అదితి అశోక్‌.. నువ్వు తృటిలో పతకం కోల్పోయినప్పటికీ టోక్యోలో నాలుగో స్థానంలో నిలిచావు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం. నీ ప్రయాణం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా - కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని