Virat Kohli: అభిమానులకు విరాట్‌ కోహ్లీ మరో షాక్‌

తాజా వార్తలు

Updated : 20/09/2021 00:56 IST

Virat Kohli: అభిమానులకు విరాట్‌ కోహ్లీ మరో షాక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో జరగనున్న టీ 20 ప్రపంచకప్‌ తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్‌గా వైదొలుతానని నిర్ణయం ప్రకటించి ఇప్పటికే అభిమానులకు ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన టీమ్‌ఇండియా సారథి కోహ్లీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ 2021 తర్వాత రాయల్‌ ఛాలంజెర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్సీ కూడా వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.  ఈ సీజన్‌ మ్యాచ్‌లు పూర్తికాగానే కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ఆర్‌సీబీ జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగాలని కోహ్లి నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్‌గా ఇదే నాకు చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని పేర్కొన్నాడు. తన చివరి ఐపీఎల్‌ వరకు ఆర్‌సీబీ జట్టుతోనే ఉంటానన్నాడు. ఇన్నాళ్లు నమ్మకం ఉంచి, మద్దతు ఇచ్చిన ఆర్‌సీబీ అభిమానులకు, జట్టు యాజమాన్యానికి కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. 

ఆర్‌సీబీ జట్టు తరఫున 2008 నుంచి కోహ్లీ ఆడుతున్నాడు. 2013 నుంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇంత హఠాత్తుగా ఆర్‌సీబీ కెప్టెన్సీని ఎందుకు వదులుకుంటున్నాడో కారణం తెలియాల్సి ఉంది. ఏదేమైనా కోహ్లీ అభిమానులకు, ఆర్‌సీబీ అభిమానులకు ఈ నిర్ణయం మింగుడు పడనిదే. 

ఇప్పటివరకు కోహ్లీ 199 మ్యాచుల్లో 191 ఇన్నింగ్స్‌ల్లో 6076 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 40 అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు ఉన్నప్పటికీ కోహ్లీ సార్థథ్యంలోని ఆర్‌సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్‌ కప్పు గెలవలేకపోయింది. 2009, 2011, 2016లో ఆర్‌సీబీ ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌గానే మిగిలింది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని