close

హైదరాబాద్‌ శుభారంభం 

సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా కబడ్డీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ బాలుర జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్‌ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో బాలబాలికల విభాగాల్లో ఈ ఛాంపియన్‌షిప్‌ ఆరంభమైంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన బాలుర మ్యాచ్‌లో హైదరాబాద్‌ 40-27 తేడాతో మెదక్‌పై విజయం సాధించింది. ఆరంభం నుంచి హైదరాబాద్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వరుస పాయింట్లతో ప్రత్యర్థిని హడలెత్తించి 21-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత కూడా అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో రంగారెడ్డి 56-29తో నిజామాబాద్‌ను చిత్తుచేసింది. బాలికల మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు తొలి అడుగు ముందుకు పడింది. ఆ జట్టు 37-19తో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. అంతకుముందు శాట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించారు. క్రీడాకారులతో కరచాలనం చేశారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.