close
టైటిల్‌ పోరుకు సింధు

ఇండోనేసియా సూపర్‌ సిరీస్‌
యమగూచితో నేడే ఫైనల్‌

ఇండోనేసియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు అదరగొడుతోంది. క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఒకుహరను చిత్తు చేసిన ఈ తెలుగమ్మాయి.. సెమీఫైనల్లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీ (చైనా)ను ఓడించి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

జకర్తా

భారత స్టార్‌ షట్లర్‌ సింధు ఈ సీజన్‌లో తొలిసారి సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం సెమీస్‌లో ఐదో సీడ్‌ సింధు 21-19, 21-10తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ చెన్‌ యుఫీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మాత్రమే సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలో 4-7తో వెనకబడిన సింధు.. ఆ తర్వాత విరామ సమయానికి 10-11తో ప్రత్యర్థిని సమీపించింది. కొన్ని మెరుపు స్మాష్‌లు ఆడిన చెన్‌.. 15-12తో గేమ్‌ గెలిచేలా కనిపించింది. అయితే గొప్పగా పుంజుకున్న సింధు వరుస పాయింట్లు సాధించి ప్రత్యర్థిని సమీపించడమే కాక.. ఆ తర్వాత 18-18తో స్కోరు సమం చేసింది. స్కోరు 19-19గా ఉన్నప్పుడు చెన్‌ కొట్టిన షాట్‌ నెట్‌కు తగలడంతో 20-19తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. ఆ తర్వాత మరో మెరుపు షాట్‌తో 21-19తో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌ ఆరంభంలో చెన్‌ 4-0 ఆధిక్యంలోకి వెళ్లినా.. వరుస పాయింట్లు సాధించిన సింధు ప్రత్యర్థిని దాటేయడమే కాక 16-8తో ముందంజ నిలిచింది. అదే జోరులో సింధు 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ నెగ్గింది. ఆదివారం టైటిల్‌ పోరులో సింధు.. అకానె యమగూచి (జపాన్‌)తో అమీతుమీ తేల్చుకోనుంది. యమగూచిపై సింధుకు 10-4 విజయాల రికార్డు ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.