Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 178732
            [news_title_telugu_html] => 

మూడోసారి.. పసిడి గురి

[news_title_telugu] => మూడోసారి.. పసిడి గురి [news_title_english] => [news_short_description] => సరికొత్త చరిత్ర సృష్టించేందుకు.. భారత బ్యాడ్మింటన్‌ స్వర్ణయుగంలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునేందుకు.. తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ముందు మరో అవకాశం వచ్చి వాలింది. ఆకలి మీద ఉన్న పులిలా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోన్న ఆమె.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో చైనా క్రీడాకారిణి చెన్‌ యూ ఫీని చిత్తుచేసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగు పెట్టింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
మూడోసారి.. పసిడి గురి - EENADU
close
మూడోసారి.. పసిడి గురి

హ్యాట్రిక్‌ ఫైనల్లో సింధు
నేడు ఒకుహరతో టైటిల్‌ పోరు
సాయి ప్రణీత్‌కు కాంస్యమే
ప్రపంచ బ్యాడ్మింటన్‌

సరికొత్త చరిత్ర సృష్టించేందుకు..
భారత బ్యాడ్మింటన్‌ స్వర్ణయుగంలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునేందుకు..
తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ముందు మరో అవకాశం వచ్చి వాలింది.
ఆకలి మీద ఉన్న పులిలా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో దూసుకెళ్తోన్న ఆమె.. ఫైనల్లోకి దూసుకెళ్లింది.
సెమీస్‌లో చైనా క్రీడాకారిణి చెన్‌ యూ ఫీని చిత్తుచేసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగు పెట్టింది.
గత రెండు పర్యాయాల్లో చివరి మెట్టుపై తడబడిన ఆమె.. ఈ సారైనా పసిడి సాధిస్తుందా..
ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తుందా అన్నది ఆదివారం తేలిపోనుంది.
మరోవైపు సెమీస్‌లో ఓడిన భమిడిపాటి సాయిప్రణీత్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

‘‘ఆనందంగా ఉన్నా. కానీ ఇంకా సంతృప్తి చెందలేదు. ఇంకో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. కచ్చితంగా స్వర్ణం గెలవడం కోసమే ప్రయత్నిస్తా. కానీ అదంత సులభం కాదు. ఒకుహరతో గత కొంతకాలంగా తలపడుతూనే ఉన్నా. మ్యాచ్‌ రోజూ ఏమైనా జరగొచ్చు. నా ఆటపై దృషి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన చేస్తా’’

- సింధు

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌)

భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు మరోసారి అద్భుతం చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అనగానే పతాక స్థాయి ఆటతో చెలరేగిపోయే ఆమె.. టోర్నీలో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయిన సింధు.. ఆ కసినంతా ఈ టోర్నీలో ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. పసిడిపోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఐదో సీడ్‌ సింధు 21-7, 21-14 తేడాతో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌, ప్రపంచ మూడో ర్యాంకర్‌ చెన్‌ యూ ఫీని వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. కేవలం 40 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ పోరాటం ముగిసింది. సెమీస్‌లో అతను 13-21, 8-21తో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ ఓటమితో అతను కాంస్యానికే పరిమితమైనప్పటికీ.. అతను 36 ఏళ్ల తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన భారత పురుష షట్లర్‌గా రికార్డులకెక్కాడు. 1983లో ప్రకాశ్‌ పదుకొనే కాంస్యం గెలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు అదే తొలి పతకం.

అదే జోరు

క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై పోరాడి గెలిచిన సింధు.. సెమీస్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ మ్యాచ్‌ ముందు వరకు చెన్‌తో తలపడిన గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింట్లో నెగ్గిన సింధు మరోసారి పైచేయి సాధించిది. తొలి గేమ్‌ను దూకుడుగా ఆరంభించింది. క్రాస్‌కోర్టు షాట్లు, స్మాష్‌లు, సుదీర్ఘ ర్యాలీలు.. ఇలా అన్నిటా ఆమెదే హవా. గేమ్‌ ఆరంభంలోనే 4-1తో ఆధిక్యం సంపాదించిన సింధు.. ప్రత్యర్థికి హెచ్చరికలు పంపింది. 11-3 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఆమె 14-4తో గేమ్‌ విజయం దిశగా పరుగులు పెట్టింది. కేవలం 15 నిమిషాల్లోనే సింధు 21-7తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ ఆరంభంలో చెన్‌ నుంచి సింధుకు ప్రతిఘటన ఎదురైంది.  పోటీలో నిలవాలని పోరాడిన చెన్‌ ప్రయత్నాలను విఫలం చేసిన సింధు ముందంజ వేసింది. మొదట స్కోరు 3-3తో సమమైంది. మ్యాచ్‌లో సింధుకు పోటీ ఎదురైంది ఆ కొద్దిసేపే. ప్రత్యర్థిని పొరపాట్లు చేసేలా ఉసిగొల్పి పాయింట్లు నెగ్గిన ఆమె 10-6తో ఆధిక్యం సాధించింది. నిలకడ కొనసాగించి 18-9తో విజయానికి చేరువైంది. ఆ దశలో చెన్‌ వరుసగా పాయింట్లు నెగ్గిన కూడా సింధుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోయింది. 20-14తో నిలిచిన ఆమె గేమ్‌ పాయింట్‌ సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ఒత్తిడికి తలొగ్గి

ప్రి క్వార్టర్స్‌, క్వార్టర్స్‌లో తనకంటే మెరుగైన క్రీడకారులను ఓడించి సెమీస్‌ చేరిన ప్రణీత్‌.. సెమీస్‌లో మాత్రం తడబడ్డాడు. టాప్‌ సీడ్‌ మొమొటకు తలొగ్గి ఓటమి పాలయ్యాడు. వరుసగా భారీ మ్యాచ్‌లు ఆడడం వల్ల అలసట చెందిన ప్రణీత్‌ ప్రత్యర్థి ధాటికి నిలవలేకపోయాడు. వరుస గేమ్‌ల్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. తొలి గేమ్‌ను 5-3 ఆధిక్యంతో ఆరంభించిన ప్రణీత్‌ ఆ తర్వాత తడబడ్డాడు. మొమొట లయ అందుకోవడంతో ప్రణీత్‌కు ఇబ్బందులు తప్పలేవు. ఓ దశలో 10-15తో వెనకబడ్డ అతను తిరిగి పుంజుకునేలా కనిపించలేదు. అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 12-18తో ఉన్నపుడు వరుసగా మూడుసార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టి గేమ్‌ కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ అసౌకర్యంగా కనిపించిన అతను పూర్తిస్థాయి ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. పదే పదే షటిల్‌ను నెట్‌కు కొట్టి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు.

ఫైనల్‌
సింధు × ఒకుహర (జపాన్‌)
ఉదయం 11 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

స్వర్ణ సంబరం.. ఈసారైనా?
ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ప్రస్థానం అసాధారణం. ప్రకాశ్‌ పదుకొనే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు సాగిన నిరీక్షణకు 2013లో తెరదించుతూ కాంస్యం నెగ్గిన ఆమె.. ఆ తర్వాత ఇంకో మూడు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇప్పటికే ఈ టోర్నీలో సింధు ప్రదర్శన అద్భుతం. కానీ నాలుగు పతకాలు గెలిచినా.. స్వర్ణం సాధించే సత్తా ఉండి కూడా ఆ ముచ్చట తీర్చుకోకపోవడం మాత్రం నిరాశ కలిగించే విషయమే. గత రెండు పర్యాయాలూ ఫైనల్లో గొప్పగా పోరాడినా.. చివరి దశలో తడబడి రజతాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకసారి పసిడి చేజారినా.. నిరాశ చెందకుండా మళ్లీ దానికి చేరువగా వెళ్లడం.. మళ్లీ ఎదురు దెబ్బ తగిలినా.. వెరవకుండా మూడో పర్యాయం ఫైనల్‌ చేరడం చిన్న విషయం కాదు. మరి ఈసారైనా ఆమె పసిడి కల నెరవేర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఆదివారం తుదిపోరులో సింధు.. ఒకుహరతో తలపడనుంది. ఇప్పటి వరకు ఆమెతో పోటీపడిన మ్యాచ్‌ల్లో 8-7తో సింధూదే పైచేయి. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తుదిపోరులో సింధు.. ఒకుహర చేతిలోనే ఓడింది. తొలిసారి ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్‌ చేరి టైటిల్‌కు అత్యంత చేరువగా వెళ్లిన ఆమెకు నిరాశను మిగిల్చిందీ జపాన్‌ స్టార్‌. మళ్లీ రెండేళ్ల తర్వాత సింధును అడ్డుకోవడానికి ఆమె సిద్ధమవుతోంది. ఈసారి ఒకుహరను మట్టికరిపించి పసిడి కల నెరవేర్చుకోవడమే కాదు.. 2017 పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలని చూస్తోంది సింధు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సింధు, ఒకుహర మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయం సాధించారు. అయితే ప్రపంచ స్థాయి వేదికలపై అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించే సింధు.. ఫైనల్‌కు రాగానే తడబడుతుంది. గత కొన్నేళ్లలో ఆమె ఎన్నోసార్లు తుదిమెట్టుపై బోల్తాపడడం చూశాం. కష్టపడకుండానే తలొంచుతుందా అంటే అదీ కాదు. ప్రాణం పెట్టి పోరాడుతుంది. కానీ ఫలితం మాత్రం ఆమెకు అనుకూలంగా రావడం లేదు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు వచ్చిన మరో అవకాశాన్ని రెండు చేతులారా అందుకొని సగర్వంగా పసిడిని ధరించాలి అంటే ఆమె ఆ ఫైనల్‌ ఫోబియాను వీడాల్సిందే. ఆ బలహీనతను అధిగమించి సింధు విశ్వవిజేతగా నిలిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.