close
ఫైనల్లో హైదరాబాద్‌ జట్లు

అంతర్‌ జిల్లా టీటీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్లు సత్తాచాటాయి. టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ విభాగంలో జూనియర్‌ బాలుర, పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జూనియర్‌ బాలుర టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో హైదరాబాద్‌ 3-0 తేడాతో నల్గొండపై విజయం సాధించింది. హైదరాబాద్‌ ఆటగాళ్లు జషన్‌ సాయి 11-6, 11-5, 11-4తో రఘురామ్‌పై, ఎస్‌ఎస్‌కే కార్తీక్‌ 11-2, 11-4, 11-7తో జె.కార్తీక్‌పై, కేశవన్‌ 11-2, 11-6, 11-8తో సాత్విక్‌పై గెలిచారు. మరో సెమీస్‌లో రంగారెడ్డి 3-0తో కరీంనగర్‌ను ఓడించింది. మహిళల సెమీస్‌లోనూ హైదరాబాద్‌ 3-0తో నల్గొండపైనే గెలిచింది. సింగిల్స్‌ల్లో హనీఫా 14-12, 11-8, 11-4తో తేజస్వినిపై, శ్రిష్ఠి 11-6, 11-3, 11-6తో దేవిశ్రీపై, డబుల్స్‌లో రాఘ నివేదిత- నిఖిత జోడీ 11-5, 11-7, 11-8తో తేజస్విని- శోభపై నెగ్గారు. రంగారెడ్డి 3-0తో వరంగల్‌పై పైచేయి సాధించింది. పురుషుల సెమీస్‌లో హైదరాబాద్‌ 3-0తో పెద్దపల్లిని చిత్తుచేసింది. శ్రీనాథ్‌ రెడ్డి 11-4, 11-7, 11-7తో శ్రీరామ్‌పై, శాశ్వత్‌ 11-5, 11-4, 11-5తో నవీన్‌పై, వాత్సిన్‌ 11-3, 11-8, 11-4తో సత్యమ్‌పై విజయాలు సాధించారు. మరో సెమీస్‌లో రంగారెడ్డి 3-0తో మెదక్‌ను మట్టికరిపించింది.అంతకుముందు ఎమ్మెల్సీ రామచంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.