close
ఖోఖో ఛాంప్‌ విజ్ఞాన్‌

స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహించిన ఖోఖో బాలికల పోటీల్లో విజ్ఞాన్‌ విద్యాలయ జట్లు సత్తాచాటాయి. అండర్‌-18, 14 విభాగాల్లో టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అండర్‌-18 బాలికల ఫైనల్లో విజ్ఞాన్‌ విద్యాలయ 8-6 తేడాతో ది ఫ్యూచర్‌ కిడ్స్‌పై విజయం సాధించింది. అండర్‌-14 తుదిపోరులో విజ్ఞాన్‌ జట్టు 4-3తో కార్నర్‌స్టోన్‌ ఉన్నత పాఠశాలను ఓడించింది. బాస్కెట్‌బాల్‌ అండర్‌-18 బాలుర విభాగంలో చిరెక్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాల ట్రోఫీ కైవసం చేసుకుంది. టైటిల్‌ పోరులో ఆ జట్టు 20-8తో మెలుహ ఇంటర్నేషనల్‌పై నెగ్గింది. అండర్‌-11 బాలుర ఫైనల్లో దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ 8-0తో విజ్ఞాన్‌ విద్యాలయపై జయకేతనం ఎగురవేసింది.

మెరిసిన మిహిక, పృథ్వీ:  బ్యాడ్మింటన్‌ అండర్‌-17 విభాగంలో మిహిక ఠాకూర్‌ (కెన్నడీ), పృథ్వీ (విద్యాంజలి) టైటిళ్లు దక్కించుకున్నారు. బాలికల సింగిల్స్‌లో మిహిక, బాలుర విభాగంలో పృథ్వీ విజేతలుగా నిలిచారు. బాలికల ఫైనల్లో మిహిక 21-16, 20-22, 21-7తో కోమల్‌ అరుణ్‌ (శ్రీ చైతన్య)పై గెలిచింది. బాలుర తుదిపోరులో పృథ్వీ 12-21, 21-12, 21-17తో ఉదయ్‌తేజ (సిల్వర్‌ ఓక్స్‌)పై నెగ్గాడు. అండర్‌-15 బాలుర సింగిల్స్‌లో స్రవంత్‌ సూరి (సిల్వర్‌ ఓక్స్‌), బాలికల సింగిల్స్‌లో తన్వి (భాష్యం బ్లూమ్స్‌ గ్లోబల్‌), అండర్‌-13 బాలుర సింగిల్స్‌లో మహేశ్‌ (సెయింట్‌ జోసెఫ్‌), బాలికల సింగిల్స్‌లో సాయి హాసిని (విద్యాంజలి) ఛాంపియన్లుగా నిలిచారు. అండర్‌-16 బాలుర 2000మీ. పరుగులో మహమ్మద్‌ అలీ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, షేక్‌పేట్‌) స్వర్ణం గెలిచాడు. 7:05.63 నిమిషాల్లో అతను రేసు పూర్తి చేశాడు. అరవింద్‌ (7:12.21ని- రైల్వే జూనియర్‌ కళాశాల), వివేక్‌ (7:26.31సె- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఫిల్మ్‌నగర్‌) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. బాలికల 2000మీ. పరుగులో శ్రావణి (ప్రభుత్వ ఉన్నత పాఠశాల) 10:43.89 నిమిషాల టైమింగ్‌తో పసిడి ఎగరేసుకుపోయింది. పాణిపాక్‌ కిజుమ్రోనెన్‌ (10:54.51ని- ఇండస్‌ ఇంటర్నేషనల్‌), అశ్రిత (11:21.35ని- సన్‌ఫ్లవర్‌ వేదిక్‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అండర్‌-18 బాలుర 1500మీ.పరుగులో సాయి తిలక్‌ (5:48.36ని- మెలుహ ఇంటర్నేషనల్‌), ఆదిత్య (5:52.63ని- పల్లవి మోడల్‌), హర్ష్‌వర్ధన్‌ (6:47.56ని- విజ్ఞాన్‌ విద్యాలయ) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.