close

ప్రధానాంశాలు

భారత్‌ ఓటమి

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. గురువారం జరిగిన గ్రూప్‌-బి రెండో పోరులో భారత్‌    1-4తో మలేసియా చేతిలో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 18-21, 15-21తో లీ జియా చేతిలో ఓడాడు. డబుల్స్‌లో చిరాగ్‌- అర్జున్‌  18-21, 15-21తో ఆరోన్‌- సో వూ చేతిలో పరాజయం చవిచూశారు. రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 14-21, 21-16, 21-19తో జూన్‌ వీపై నెగ్గాడు. రెండో డబుల్స్‌లో ధృవ్‌- లక్ష్యసేన్‌, మూడో సింగిల్స్‌లో ప్రణయ్‌ ఓడిపోయారు. ఆరంభ రౌండ్లో గెలవడం ద్వారా భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌పై గెలవడం అంత తేలికేమీ కాదు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.