close

ప్రధానాంశాలు

ముందు ఫిట్‌నెస్‌ పరీక్ష నెగ్గాలి

ముంబయి: విరామం తర్వాత మళ్లీ శిక్షణ కొనసాగించాలంటే ముందు ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గాల్సి ఉందని భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మ అన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనలో రోహిత్‌ గాయంతో మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నా. ఆ వారంలోనే నా ఫిట్‌నెస్‌ పరీక్ష జరగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. కానీ ఇప్పుడు మళ్లీ బరిలో దిగాలి అంటే కచ్చితంగా ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలి. లాక్‌డౌన్‌ ఎత్తేశాక జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి ఈ పరీక్షకు హాజరవుతాను’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.