
ప్రధానాంశాలు
రోహిత్ ఎందుకు రాలేదో ఇంకా తెలీదు: కోహ్లీ
మేమంతా ఎదురుచూపుల ఆట ఆడామన్న సారథి
సిడ్నీ: టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మ గాయం పరిస్థితిపై సమాచారం పూర్తిగా లేదని, గందరగోళం నెలకొందని సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టు సభ్యులతో కలిసి అతడెందుకు దుబాయ్‌లో విమానం ఎక్కలేదో తెలియదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు అతడు ఆన్లైన్లో మీడియాతో మాట్లాడాడు. సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు తాను జట్టుకు అందుబాటులో ఉండనని రోహిత్ చెప్పాడని వివరించాడు.
ఐపీఎల్-13లో పంజాబ్‌తో రెండో మ్యాచులో రోహిత్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కొన్ని మ్యాచుల్లో ఆడలేదు. దాంతో ఆసీస్ పర్యటనకు హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేయలేదు. కానీ జట్టును ప్రకటించిన రోజునే రోహిత్ ప్యాడ్లు కట్టుకొని సాధన చేసిన వీడియో బయటకు రావడంతో వివాదం చెలరేగింది. అతడి గాయం పరిస్థితి ఏంటో చెప్పాలని గావస్కర్, మంజ్రేకర్ డిమాండ్ చేశారు. దానికి తోడు లీగులో ఆఖరి మ్యాచ్ నుంచి రోహిత్ క్రికెట్ ఆడాడు. తాను ఫిట్‌గా ఉన్నట్టు ప్రకటించాడు. టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినప్పటికీ జట్టుతో కలిసి ఆసీస్‌కు వెళ్లలేదు.
‘సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు మాకో మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయం కావడంతో రోహిత్ అందుబాటులో ఉండడని అందులోని సారాంశం. గాయం వల్ల లాభనష్టాలేంటో అతడికి వివరించామని, అర్థం చేసుకున్న అతడు జట్టుకు అందుబాటులో ఉండనని చెప్పినట్టు వివరణ ఉంది. కానీ అతడు మళ్లీ ఐపీఎల్ ఆడిన తర్వాత ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడనే అందరం అనుకున్నాం. కానీ అతడెందుకు మాతో రావడం లేదో సమాచారం లేదు. స్పష్టత ఇవ్వలేదు. మేం ఎదురుచూపుల ఆట ఆడాం’ అని కోహ్లీ వివరించాడు.
వాస్తవంగా ఐపీఎల్ ముగిసిన తర్వాత రోహిత్ జట్టుతో కలిసి వెళ్తాడన్న సమాచారం బయటకు వచ్చింది. టెస్టు సిరీసులోపు అతడు పూర్తిగా కోలుకుంటాడని భావించారు. కానీ అతడు తిరిగి ముంబయికి చేరుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏలో ఇషాంత్ శర్మతో కలిసి సాధన మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత అతడి గాయాన్ని పరీక్షించిన వైద్యులు ఫిట్‌గా లేడని నివేదిక ఇవ్వడంతో ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ ప్రకటించింది. క్వారంటైన్ నిబంధనలను పరిశీలిస్తే ఆఖరి రెండు టెస్టులకూ అనుమానమేనని అంటున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదని విరాట్ కోహ్లీ అన్నాడు. కాస్త గందరగోళంగా అనిపిస్తోందని తెలిపాడు. ఇందుకు ఐసీసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ముందు పాయింట్ల పరంగా టాప్-2లో నిలిచిన జట్లతో ఫైనల్ ఆడిస్తామని చెప్పి ఇప్పుడు విజయాల శాతం ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించాడు.
ప్రధానాంశాలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
