close

తాజావార్తలు

అనుభవలేమే ఓటమికి కారణం: డుప్లెసిస్‌

పుణె: అనుభవలేమి జట్టుతో బరిలోకి దిగడమే భారత్‌తో ఓటమికి కారణమని దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ అన్నాడు. ‘అనుభవం లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని భావిస్తున్నాను. అనుభవజ్ఞులు ఉన్న జట్టే అత్యుత్తమ టెస్టు జట్టుగా పరిగణిస్తాను. ఈ విషయాన్ని టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు కూడా చెప్పాను. భారత జట్టులో అనుభవజ్ఞులకు కొదవలేదు. వారి డ్రెస్సింగ్‌ రూంలో ఎన్నో మ్యాచ్‌లాడిన సీనియర్లు ఉన్నారు. డేల్‌ స్టెయిన్, మోర్కెల్, హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌ వంటి గొప్ప ఆటగాళ్లను మేము కోల్పోయాం. వారి స్థానాలను రాత్రికి రాత్రే యువ ఆటగాళ్లతో భర్తీచేయలేం. మా జట్టులో 5 నుంచి 15 టెస్టులు అనుభవమున్న ఆటగాళ్లు మత్రమే ఉన్నారు. భారమంతా నాతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు ఎల్గర్‌, డికాక్‌పై పడింది. కానీ, యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవ్వడం మా ఓటమికి మరో కారణం. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ 40-50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోతున్నాం. ఫామ్‌లో లేకుండా భారత్‌లో ఆడటం ఎంతో కష్టం’ అని అన్నాడు.

పుణె వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 137 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. దీంతో సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 0-2తో కోల్పోయింది. విదేశాల్లో సఫారీసేనకు వరుసగా ఇది ఆరో ఓటమి. 2017 జులై నుంచి విదేశాల్లో దక్షిణాఫ్రికా ఒక్క టెస్టును కూడా గెలవలేకపోయింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.