
తాజావార్తలు
ముంబయి: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల మనసు దోచుకున్నాడు. సహచరులను తానెంత ప్రేమిస్తున్నాడో చేతల ద్వారా చాటిచెప్పాడు. ఇండోర్‌లో తన కోసం కాకుండా మహ్మద్ షమి కోసం చప్పట్లు, కేరింతలు కొట్టాలని అభిమానులను కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందరినీ ఆకట్టుకుంటోంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 150 పరుగులకు పరిమితం చేశారు. మహ్మద్ షమి బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టి కీలకమైన మూడు వికెట్లు తీశాడు.
మ్యాచ్ జరుగుతున్నప్పుడు హోల్కర్ స్టేడియంలో భారత్‌ను ప్రోత్సహించేందుకు అభిమానులు విరాట్ కోహ్లీకి మద్దతుగా నినాదాలు చేశారు. కోహ్లీ కల్పించుకొని తన కోసం కాకుండా బౌలింగ్ చేస్తున్న షమిని ఉత్సాహ పరచాలని చేతల ద్వారా సూచించాడు. అప్పుడు షమి 55వ ఓవర్ వేస్తున్నాడు. విరాట్ చేతలు బౌలర్లో స్ఫూర్తి నింపిందో ఏమోగానీ ఆ ఓవర్ ఐదో బంతికి కీలకమైన ముష్ఫికర్‌ను ఔట్ చేశాడు. చివరి బంతికి మెహిది హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తేనీటి విరామానికి బంగ్లాను 140/7కు పరిమితం చేశాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన షమికి త్రుటిలో హ్యాట్రిక్ చేజారింది. తన తర్వాత ఓవర్ మొదటి బంతిని తైజుల్ ఇస్లామ్ విజయవంతంగా డిఫెండ్ చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..