close
మత్స్య ఎగుమతుల పెంపే లక్ష్యం

 ఎంపెడాతో మత్స్యశాఖ ఒప్పందం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మత్స్య ఎగుమతులను పెంచడం, రైతులను ఆక్వా కల్చర్‌ వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపెడా)తో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో గురువారం పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమక్షంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎంపీఈడీఏ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. తలసాని మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆక్వాకల్చర్‌ అభివృద్ధికి ఎంపెడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. దేశంలో ఆక్వాకల్చర్‌ రంగ అభివృద్ధికి ఆ సంస్థ హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు నిర్వహించే ‘ఆక్వా అక్వేరియా ఇండియా’ సదస్సుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఎంపెడాతో కలిసి తెలంగాణలో బహుళ జాతుల చేపల పెంపక ఆక్వాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయంలో జల నిర్బంధ సౌకర్యం, చిల్డ్‌, లైవ్‌ ఫిష్‌ నిర్వహణకు సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నారు. ఆక్వా ఎగుమతుల అభివృద్ధిలో రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయని ఎంపెడా ఛైర్మన్‌ శ్రీనివాస్‌ అన్నారు. మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, సమాచార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్యకాంబ్లే పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.