close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజల వద్దకే పరీక్షలు

విస్తృతంగా నిర్వహించాలని డీహెచ్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతిని నివారించడానికి అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) జి.శ్రీనివాసరావు అన్ని జిల్లాల వైద్యాధికారులకు సూచించారు. కేంద్రాలకు రాలేని ప్రజలను దృష్టిలో ఉంచుకుని, వారి వద్దకే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్‌ విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇటీవల సీఎం, హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో జిల్లాల వైద్యాధికారులతో ఆయన దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న 1096 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు అదనంగా అవసరమైన ప్రతిచోటా నెలకొల్పాలని, సంచార నిర్ధారణ పరీక్షల వాహనాల సేవలనూ విస్తారించాలన్నారు. పీహెచ్‌సీల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒక్కో ఆక్సిజన్‌ సిలిండర్‌కు అదనంగా మరో 752 ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధంగా ఉంచనున్నామని వెల్లడించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు