close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎం కేసీఆర్‌ వైపే ప్రవాసులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రవాసులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నారని, వారంతా అవినీతిరహిత సమాజాన్ని కోరుకుంటున్నారని, ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను హర్షిస్తున్నారని తెరాస ప్రవాస విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రవాసుల సమావేశం పేరిట మభ్య పెడుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈటల రాజేందర్‌ విషయంలో కేసీఆర్‌ అనుసరించిన వైఖరిని అందరూ సమర్థిస్తున్నారన్నారు. ప్రవాసులకు ఈటల ఏ రోజూ, ఎలాంటి సాయం చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవాసులకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు