ఉపాధ్యాయ దంపతుల విషాదాంతం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాధ్యాయ దంపతుల విషాదాంతం

3 నెలల కిందటే అసువులు బాసిన కుమార్తె
అనాథలా మిగిలిన మరో బిడ్డ

రామకృష్ణాపూర్‌, మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతోంది. మంచిర్యాల జిల్లా గద్దెరాగడి గ్రామంలో ఉపాధ్యాయ దంపతులను కబళించింది. గ్రామానికి చెందిన సీతారామరాజు (45) మంచిర్యాల జిల్లా కేతనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, భార్య బాల శైలజ (43) కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్‌ టీచరుగా పనిచేస్తున్నారు. సీతారామరాజుకు గత నెల 29న కరోనా పాజిటివ్‌ రాగా ఆన్‌లైన్‌లో వైద్యుడిని సంప్రదించి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. శైలజ ఈ నెల 3న పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. అయినా లక్షణాలు కనిపిస్తుండడంతో ఇంట్లోనే ఉంటూ మందులు వాడారు. ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు ఈ నెల 6న బెల్లంపల్లి కొవిడ్‌ ఆసుపత్రికి , ఆ తర్వాత ఈ నెల 8న కరీంనగర్‌లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి శైలజ, గురువారం సీతారామరాజు మృతి చెందారు. ఇంటర్‌ చదువుతున్న పెద్దకుమార్తె యశస్విని (17) మూడునెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. మిగిలిన ఒక్కగానొక్క కుమార్తె తేజస్విని (13) ఇప్పుడు అనాథగా మిగిలింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని