చిరుతను కుమ్మేసిన బర్రెలు..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరుతను కుమ్మేసిన బర్రెలు..

గడ్డి మేస్తున్న పశువుల మందలోని దూడపై ఓ చిరుతపులి దాడికి ప్రయత్నించింది. గేదెలు ఎదురుదాడి చేసి కొమ్ములతో కుమ్మేయడంతో చిరుత నడుము, కాళ్లు విరిగి కదల్లేని స్థితిలోకి చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం బూర్గుపల్లి సమీప గుట్టల్లో గురువారం ఈ ఘటన జరిగింది. పశువుల రైతు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి హైదరాబాద్‌ జూ పార్కుకు తరలించారు. ఈ చిరుత వయసు రెండున్నర- మూడు సంవత్సరాలు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

 న్యూస్‌టుడే, కోయిలకొండ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని