పదోన్నతుల వేతనాలపై ఉత్తర్వుల జారీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదోన్నతుల వేతనాలపై ఉత్తర్వుల జారీ

184 మంది పోలీస్‌ అధికారులకు ఉపశమనం

ఈనాడు, హైదరాబాద్‌: పదోన్నతులు పొందిన పోలీస్‌ అధికారులు కొత్త వేతనాలు పొందేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. పోలీస్‌ శాఖలో కొద్ది రోజుల క్రితం 42 మంది నాన్‌కేడర్‌ ఎస్పీలుగా, 33 మంది అదనపు ఎస్పీలుగా, 109 మంది ఏసీపీలుగా పదోన్నతులు పొందారు. రెగ్యులర్‌ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో వారిలో పలువురు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. మరికొందరు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసి ఖాళీగా ఉన్నారు. పాత వేతనాలే పొందుతూ వచ్చారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ పోస్టులో చేరితే తప్ప పదోన్నతి పోస్టింగ్‌కు సంబంధించిన వేతనాలు వచ్చే అవకాశం లేదు. రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలు కారణంగా రెగ్యులర్‌ పోస్టింగ్‌ల ప్రక్రియపై దృష్టి సారించలేకపోయిన ఉన్నతాధికారులు.. కొద్ది రోజులుగా కసరత్తు చేశారు. పదోన్నతుల మేరకు వేతనాలు ఇచ్చే ప్రక్రియకు మార్గం సుగమం చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలతోపాటు పదోన్నతుల కారణంగా ఖాళీ కానున్న స్థానాలను కొత్తగా పదోన్నతి పొందిన అధికారులతో భర్తీ చేస్తున్నట్లు వాటిలో పేర్కొన్నారు. కొత్త వేతనాలు పొందేందుకు మాత్రమే కొత్త పోస్టింగ్‌ల్లో నియమించామని, పదోన్నతులు పొందినప్పటికీ ప్రస్తుతం ఉన్న పాత స్థానాల్లోనే కొనసాగాలని స్పష్టం చేశారు. రెగ్యులర్‌ పోస్టింగ్‌లకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో కొత్తగా పదోన్నతులు పొందిన 184 మందికి ఉపశమనం లభించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు