ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బి.పి.మోహన్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బి.పి.మోహన్‌

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) తాత్కాలిక అధ్యక్షుడిగా భాస్కర్‌ పంతుల మోహన్‌ నియమితులయ్యారు. గురువారం దిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ ప్రధాన బెంచ్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌.వరదరాజన్‌ పదవీ కాలం బుధవారంతో ముగియగా, అదే రోజు బి.పి.మోహన్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988లో కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించిన ఆయన ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్‌, రాజ్యాంగ, కార్పొరేట్‌ లాలో నైపుణ్యం సాధించిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఐఐసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా విధులు నిర్వహించారు. 2017 జులైలో ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ జ్యుడిషియల్‌ సభ్యుడిగా నియమితులైన బి.పి.మోహన్‌ గత ఏడాది ఎన్‌సీఎల్‌టీ అమరావతి బెంచ్‌కు బదిలీపై వచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు