నేడు, రేపు భారీ వర్షాలు
close

ప్రధానాంశాలు

నేడు, రేపు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఒడిశాకు చేరువలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నుంచి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు పడతాయి. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 6.3, నారాయణఖేడ్‌లో 5.5, నాగల్‌గిద్దలో 4, జన్నారం(మంచిర్యాల)లో 3.1, అంకంపాలెం(భద్రాద్రి)లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని