డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి
close

ప్రధానాంశాలు

డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి

ఉన్న సీట్లలో 60 శాతం నిండితేనే

ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది కూడా ప్రైవేట్‌, ఎయిడెడ్‌ డిగ్రీ, పీజీ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు, నూతన కాంబినేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అందుకు ఆయా కళాశాలల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లలో 60 శాతం నిండితేనే 2021-22లో గరిష్ఠంగా మూడు కొత్త కోర్సులకు అనుమతి ఇస్తామన్న షరతు విధించారు. ఒక్కో కళాశాలలోని బీఏ, బీకాం, బీఎస్‌సీలో కలిపి గరిష్ఠంగా 12 కాంబినేషన్లను మాత్రమే అనుమతి ఇస్తారు. ఒక్కో కాంబినేషన్‌లో గరిష్ఠంగా మూడు సెక్షన్లే ఉండాలి. సొంత భవనంలో అయిదేళ్ల నుంచి లేదా లీజు భవనంలో పదేళ్లుగా నడుస్తున్న కళాశాలలు పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో కొత్తగా రెండు కోర్సులనే ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అదనపు సెక్షన్లు, మాధ్యమం మార్పు, కోర్సుల రద్దుకు ఈనెల 21వ తేదీని తుది గడువుగా ఉన్నత విద్యామండలి నిర్దేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని