చనిపోయిన ఏనుగు కోసం.. రాత్రంతా పొలంలోనే గజరాజుల తిష్ఠ
close

ప్రధానాంశాలు

చనిపోయిన ఏనుగు కోసం.. రాత్రంతా పొలంలోనే గజరాజుల తిష్ఠ

పలమనేరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామ సమీపంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఏనుగును ఖననం చేసిన ప్రదేశంలో 13 ఏనుగులు శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు ఉండిపోయాయి. ఏనుగును ఖననం చేసిన ప్రదేశాన్ని చుట్టి శబ్దాలు చేశాయి. వాటిని చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తమ గుంపులోని ఏనుగు మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేని అవి గ్రామస్థులపైకి తిరగబడ్డాయి. వాటిని అడవిలోకి తరిమేందుకు స్థానికులు ప్రయత్నించగా చాలాసేపు ప్రతిఘటించాయి. చివరకు అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి వాటిని కౌండిన్య నదిని దాటించారు. కోతిగుట్ట గ్రామ సమీపంలోని పొలంలో గురువారం అర్ధరాత్రి ఐదేళ్ల ఆడ ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందగా శుక్రవారం అటవీశాఖ సిబ్బంది దానిని అక్కడే ఖననం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని