శ్రీశైలంలో తామ్ర శాసనాలు లభ్యం
close

ప్రధానాంశాలు

శ్రీశైలంలో తామ్ర శాసనాలు లభ్యం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల క్షేత్రంలో ఆదివారం తామ్ర శాసనాలు బయటపడ్డాయి. ఘంటామఠం ప్రాంగణంలోని ఉప ఆలయాల జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా 21 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్‌, సీఐ బి.వెంకట రమణ వాటిని పరిశీలించారు. శాసనాల్లో తెలుగు, నందినాగరి లిపి ఉన్నట్లు గుర్తించారు. మైసూరు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా సంచాలకుడు మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ.. శాసనాల్లోని లిపిని బట్టి అది 14-16 శతాబ్ద కాలం నాటిదని భావిస్తున్నట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని