విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాల విడుదల
close

ప్రధానాంశాలు

విద్యుత్‌ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖలో ఏఈ కంటే దిగువస్థాయిలో ఉండే ఇంజినీరింగ్‌ ఉద్యోగులు, జేఏవో స్థాయి వరకూ ఉన్న ఎకౌంట్స్‌ సర్వీసు ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నెల 30వ తేదీ నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఓ అండ్‌ ఎం ఉద్యోగులను బదిలీ చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్ణయించింది. 50 శాతం మంది ఉద్యోగులనే బదిలీ చేయనున్నారు. బదిలీ అయిన ఉద్యోగుల వివరాలను ఈ నెల 29న సంబంధిత డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలుంటే వచ్చే నెల రెండో తేదీలోపు తెలియజేయాల్సి ఉంటుంది. 12వ తేదీ నాటికి తుది జాబితా ఖరారవుతుంది. బదిలీ అయిన ఉద్యోగులు ఈ నెల 17వ తేదీనాటికి తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు. ఆర్టిజన్ల బదిలీలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని మరో ఉత్తర్వులో ఆయన స్పష్టంచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని