‘భువన్‌’ ఆస్తుల మ్యాపింగ్‌ జులై నాటికి పూర్తి చేయాలి
close

ప్రధానాంశాలు

‘భువన్‌’ ఆస్తుల మ్యాపింగ్‌ జులై నాటికి పూర్తి చేయాలి

పురపాలకశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో గత ఏడాది మొదలై... కరోనా వల్ల ఆగిపోయిన ఆస్తుల మ్యాపింగ్‌ను జులై నాటికి పూర్తి చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. ‘భువన్‌’ రెండో దశలో భాగంగా గత ఏడాది జులై, ఆగస్టు నెలల్లో 139 పట్టణాల్లోని 4.5 లక్షల ఆస్తుల మ్యాపింగ్‌ పూర్తయిందన్నారు. మిగిలిన ఆస్తుల మ్యాపింగ్‌ను పూర్తిచేయాలని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది మ్యాపింగ్‌ సమయంలో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్‌) 15 అంకెలతో ఉండేదని, తాజాగా ఇది పది అంకెలకు మారిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గడువులోపు మ్యాపింగ్‌ పూర్తయ్యేలా కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.  పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోని ఖాళీ స్థలాలపై పన్ను, ప్రకటనలకు సంబంధించి కొత్తగా సుపరిపాలన వేదిక (సీజీజీ) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవాలని డైరెక్టర్‌ ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని