పాత ఫీజులతోనే కళాశాలలకు అనుబంధ గుర్తింపు
close

ప్రధానాంశాలు

పాత ఫీజులతోనే కళాశాలలకు అనుబంధ గుర్తింపు

ఎత్తు 15 మీటర్ల లోపు ఉన్న   భవనాలకు ఆటోరెన్యువల్‌: ఇంటర్‌బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు 2021-22 విద్యాసంవత్సరానికి పెంపు లేకుండా పాత ఫీజులతోనే అనుబంధ గుర్తింపును ఇవ్వనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నట్లు తెలిపింది. రూ.5 వేల అపరాధ రుసుంతో జులై 7వతేదీ వరకు, రూ.10వేలతో 14 వరకు, రూ.15వేలతో 22 వరకు, రూ.20వేలతో 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గుర్తింపు ప్రక్రియకు సంబంధించి పలు వెసులుబాట్లు ఇచ్చింది. భవనాల ఎత్తు 15మీటర్ల లోపు ఉన్న జూనియర్‌ కళాశాల భవనాలకు ఆటోరెన్యువల్‌ చేయనున్నట్లు స్పష్టంచేసింది.  కళాశాలల భవనాల ఎత్తు 15 మీటర్లకు పైబడి ఉంటే అనుబంధ గుర్తింపు కోసం అగ్నిమాపక, రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్‌ల నుంచి ఎన్వోసీ తీసుకోవాలని పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని