‘రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేయాలి’
close

ప్రధానాంశాలు

‘రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేయాలి’

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మత్స్యకారులకు ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ కింద పెంచిన రూ.5 లక్షల ప్రమాద బీమాను వెంటనే అమలులోకి తీసుకురావాలని కాంగ్రెస్‌ మత్స్య విభాగం రాష్ట్ర ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పీసీసీ మత్స్య విభాగం నూతన కార్యవర్గ సమావేశం గురువారం గాంధీభవన్‌లో జరిగింది. నూతనంగా కార్యవర్గంలోకి వచ్చిన వారికి నియామక పత్రాలు అందజేశారు. సాయికుమార్‌ మాట్లాడుతూ.. రూ.40 వేలు ఉన్న బీమా మొత్తాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2లక్షలకు పెంచిందన్నారు. తర్వాత అధికారం చేపట్టిన భాజపా నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఈ బీమాను రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారన్నారు. ఇప్పటివరకూ దాన్ని అమలు చేయడం లేదని వాపోయారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని