వర్షాలతో రైళ్లకు ఆటంకాలు

ప్రధానాంశాలు

వర్షాలతో రైళ్లకు ఆటంకాలు

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. 25న గుంటూరు-రాయగడ, 26న రాయగడ-గుంటూరు, భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయ్యాయి. అహ్మదాబాద్‌-ఎర్నాకుళం, చండీగఢ్‌-కొచ్చువెలి రైళ్లను శనివారం దారి మళ్లించి నడిపించారు. తిరుపతి-కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ కొల్హాపూర్‌-మిరాజ్‌ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దయ్యింది. కొన్నిరైళ్ల ప్రయాణ సమయం మారింది. ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ జులై 25 నుంచి ఆగస్టు 9 వరకు సాయంత్రం 4.15 గంటలకు బదులుగా 6.20కి బయల్దేరుతుంది. హైదరాబాద్‌-పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ 26వ తేదీనుంచి ఆగస్టు 8 వరకు ఉదయం 8.20కి బదులుగా 9.50కి బయల్దేరుతుందని ద.మ.రైల్వే తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని