17న కృష్ణా, గోదావరి బోర్డు ఉపకమిటీ సమావేశం

ప్రధానాంశాలు

17న కృష్ణా, గోదావరి బోర్డు ఉపకమిటీ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ),  గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఉప కమిటీ సమావేశం ఈ నెల 17వ తేదీన జరుగనుంది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ జలసౌధలో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరుతూ జీఆర్‌ఎంబీ కన్వీనర్‌ బి.పి.పాండే బుధవారం కమిటీ సభ్యులకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని క్లాజుపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. 11వ బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులు సూచించిన అంశాలపై సంబంధిత ఎజెండా కింద చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సభ్యులు సంబంధిత పత్రాలు, ఎజెండా అంశాలతో సమావేశానికి రావాలని లేఖలో కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని