ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ప్రధానాంశాలు

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ యంత్రాంగాన్ని తీసుకువచ్చేలా ఆదేశించాలని కోరింది. కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది, ఈ ఏడాది జారీ చేసిన జీవో 46, 75లపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘‘తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని జీవోలు జారీ చేశారు. అయితే ట్యూషన్‌ ఫీజు కింద ఏవి వస్తాయో స్పష్టత ఇవ్వలేదు. లైబ్రరీ ఫీజు, మెస్‌, కంప్యూటర్‌, డెవలప్‌మెంట్‌ ఫీజు, కల్చరల్‌ ఇలా రకరకాలైన వాటిని దీని కింద వసూలు చేస్తున్నారు. ట్యూషన్‌ ఫీజు పెంచుకునే విచక్షణాధికారాన్ని పాఠశాలలకు ఇవ్వడం ఏకపక్షం. ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధం. ఈ జీవోలను సవరించేలా ఆదేశాలివ్వాలి’’ అని పిటిషన్‌లో కోరింది. తిరుపతిరావు కమిటీ నివేదికను బయటపెట్టేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. అందిస్తామని వివరణ ఇచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని