నెలాఖరులో ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌!

ప్రధానాంశాలు

నెలాఖరులో ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌!

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఈనెలాఖరు లేదా నవంబరు మొదటివారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈనెల 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని అధికారులు కాలపట్టికను శుక్రవారం ప్రకటించారు. మరికొద్ది రోజులు ఆగాలని ప్రభుత్వం సూచన అందడంతో కాలపట్టికను రద్దు చేసినట్లు తెలిసింది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్‌ తొలి విడత సీట్లు ఈనెల 27న, రెండో విడత సీట్లు నవంబరు ఒకటిన కేటాయిస్తారు. అందుకే కనీసం ఒక విడత సీట్ల కేటాయింపు తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని