అరుణాచల్‌ పరీక్షలో మెరిసిన వంశీకృష్ణ

ప్రధానాంశాలు

అరుణాచల్‌ పరీక్షలో మెరిసిన వంశీకృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: మన రాష్ట్రంలో గ్రూపు-1కు సమానమైన అరుణాచల్‌ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కంబైన్డ్‌ ఎగ్జామినేషన్‌(ఏపీపీఎస్‌సీసీఈ)లో హైదరాబాద్‌ యువకుడు భోనగిరి వంశీకృష్ణ 16వ ర్యాంకు సాధించారు. జిల్లా ల్యాండ్‌ రెవెన్యూ, సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోనే ఇంటర్‌ వరకు చదివిన వంశీకృష్ణ.. ప్రస్తుతం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) నుంచి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుతున్నారు. దీనిపై బ్రెయిన్‌ ట్రీ సంస్థ సంచాలకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మన విద్యార్థులు రాష్ట్రంలోని ఉద్యోగాలకే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పోటీపడాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని