నిమ్జ్‌ను రద్దు చేయాలి

ప్రధానాంశాలు

నిమ్జ్‌ను రద్దు చేయాలి

నిమ్జ్‌ వ్యతిరేక పోరాట సమితి, రైతుల వినతి

ఈనాడు, దిల్లీ: జహీరాబాద్‌లో ప్రతిపాదించిన జాతీయ పెట్టుబడులు, తయారీ ప్రాంతం (నిమ్జ్‌)ను రద్దు చేయాలని నిమ్జ్‌ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు దిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌ వద్ద వారు జహీరాబాద్‌లో నిమ్జ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి మాట్లాడారు. వినతిపత్రాలు సమర్పించినవారిలో రైతులు, నేతలు ఆశప్ప, రాఘవరెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజనరసింహ, జైపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సాదుల్లా, ఆంజనేయగౌడ్‌, వినోద్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని