close

ప్రధానాంశాలు

డిజిటల్‌ భారత్‌లో రాష్ట్రాలను ప్రోత్సహించాలి

అక్షరాస్యత, మౌలిక వసతులు, ఆవిష్కరణలు కీలకం
సీఐఐ డిజిటల్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు,హైదరాబాద్‌: డిజిటల్‌ భారత్‌ వ్యూహంలో భాగంగా ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అన్నివిధాలా ప్రోత్సహించాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. కరోనా అనంతరం దేశం డిజిటల్‌ విప్లవం ద్వారా పురోగమించేందుకు అక్షరాస్యత, మౌలికవసతులు, ఆవిష్కరణ(త్రీడీ)లు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ‘కరోనా అనంతర యుగంలో డిజిటల్‌ విప్లవం- వాణిజ్య నిర్వహణను బలోపేతం చేయడం’ అనే అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ శిఖరాగ్ర సదస్సులో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘డిజిటల్‌, డిజిటలేతర రంగాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ద్వారానే డిజిటల్‌ విప్లవం సాధ్యమవుతుంది. సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం వల్ల సామాన్యులకు సైతం దానిపై నమ్మకం పెరుగుతుంది. ఇది సమాజంపైనా ప్రభావం చూపుతుంది’’ అని చెప్పారు.
తెలంగాణకు కేంద్ర కార్యదర్శి అభినందనలు
సంక్షోభ సమయంలోనూ ఐటీ ఎగుమతుల్లో 18% వృద్ధిని తెలంగాణ సాధించడంతో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ సాహ్ని అభినందించారు. కరోనా సమయంలో డిజిటల్‌ సేవల వినియోగాన్ని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఈ సందర్భంగా వివరించారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఓంకార్‌ రాయ్‌, టీసీఎస్‌ సాంకేతిక, వాణిజ్య విభాగాధిపతి వి.రాజన్న, ఎంపీఎల్‌ సీఈవో సాయిశ్రీనివాస్‌ కిరణ్‌, సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌ బోదనపు కిరణ్‌ పలువురు నిపుణులు సదస్సులో పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.