close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాయా విత్తనాలతో జాగ్రత్త

రాష్ట్రాల వ్యవసాయశాఖలకు కేంద్రం లేఖ

ఈనాడు, దిల్లీ విదేశాల్లో కలకలం రేపుతున్న మాయా విత్తనాల పార్శిళ్ల పట్ల కేంద్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి పార్శిళ్ల విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని కేంద్ర వ్యవసాయశాఖ అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలు, విత్తన కార్పొరేషన్లు, విత్తన ధ్రువీకరణ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పాటు కేంద్ర వ్యవసాయపరిశోధన మండలికీ లేఖలు రాసింది. ‘‘అమెరికా, కెనడా, యూకే, న్యూజిలాండ్‌, జపాన్‌తో పాటు కొన్ని యూరోపియన్‌ దేశాలకు అనుమానాస్పదంగా చేరుతున్న విత్తన పార్శిళ్లు పెనుముప్పుగా పరిణమించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ దృష్టికి వచ్చింది. ఈ పార్శిళ్లలో గుర్తుతెలియని రోగకారకాలను చొప్పించి ఉండొచ్చని, దానివల్ల పర్యావరణం, వ్యవసాయం, జాతీయభద్రతకు ముప్పు తలెత్తవచ్చని హెచ్చరించింది. ఇలాంటి అనామక విత్తన పార్శిళ్ల వల్ల దేశ జీవ వైవిధ్యానికి ప్రమాదం తలెత్తవచ్చు. అందువల్ల  అందరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని కేంద్ర వ్యవసాయశాఖ హెచ్చరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.