
ప్రధానాంశాలు
అంతర్గత స్లైడింగ్‌లో బ్రాంచి మారితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హత
ధనవంతులకే డిమాండ్ ఉన్న బీటెక్ సీట్లు
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్‌లో దాదాపు 8 వేల ర్యాంకు సాధించిన కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి హైదరాబాద్‌లోని నారాయణమ్మ కళాశాలలో ఈసీఈలో సీటు దక్కింది. సీఎస్‌ఈపై ఆసక్తి ఉన్నా సీటు లభించలేదు. ఇప్పుడు 10 వేలకుపైగా ర్యాంకు పొందిన వారు స్లైడింగ్‌లో ఆ కళాశాలలో మిగిలిన సీఎస్ఈ సీట్లలో చేరారు. తాను బ్రాంచి మారితే రూ.1.10 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, బోధన రుసుం దక్కదని భావించి కామారెడ్డి విద్యార్థిని తన ఆసక్తిని చంపుకుంది.
* వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి 8 వేలకుపైగా ర్యాంకు సాధించి సీబీఐటీలో మెకానికల్‌లో చేరాడు. మరోవైపు ఇంటర్నల్ స్లైడింగ్ విధానంలో 8 వేల ర్యాంకు విద్యార్థి ఒకరు అదే కళాశాలలో సీఎస్ఈ కోర్సు దక్కించుకున్నాడు. మరో విద్యార్థిని 5 వేల ర్యాంకుతో ఈసీఈ ఎంచుకుంది. ఆమెకు సీఎస్ఈలో చేరాలని ఉన్నా.. తర్వాత బ్రాంచి మారితే ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాదని ఈసీఈలోనే ఉండిపోయింది.
రాష్ట్రంలోని పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలల్లో స్లైడింగ్ తర్వాత మిగిలిన డిమాండ్ ఉన్న బ్రాంచిల సీట్లను ఎంసెట్‌లో ఏమాత్రం మెరిట్ లేని విద్యార్థులు పొందుతున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారు స్లైడింగ్ విధానంలో బ్రాంచి మారితే ఫీజు రీయింబర్స్మెంట్ రాదని అదే బ్రాంచిలో ఉండిపోతున్నారు. తమ కంటే పెద్ద ర్యాంకు వారు డిమాండ్ ఉన్న సీఎస్ఈ బ్రాంచిలోకి మారిపోతుండగా.. పలువురు విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితిని తలచుకొని ఆవేదన చెందుతున్నారు. స్లైడింగ్‌లో బ్రాంచి మారితే బోధన రుసుం చెల్లింపు వర్తించదని ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జీఓ జారీ చేశారు. ఇప్పటికైనా ఆ విధానాన్ని మార్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- మాటల్లో చెప్పలేను: రహానె
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య