close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది అన్నదాత ఆవిష్కరణ..

పినపాక, న్యూస్‌టుడే: పొలాల్లో గట్ల వెంట మట్టి చేరి కొంచెం ఎత్తుగా ఉంటుంది. కల్టివేటర్‌తో దున్నేటప్పుడు, గొర్రుతో చదును చేసే సమయంలో, వర్షాలకు గట్లపై మట్టి కారి ఇలా జరుగుతుంటుంది. ఈ క్రమంలో గట్ల వెంట చదును చేసేందుకు కూలీల ఏర్పాటు తప్పనిసరి అవుతుంది. చదును చేయకుండా సాగు చేస్తే ఆ భాగంలో పంట ఎదగదు. గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. నీరు సైతం నిలవదు. ఈ సమస్యలను అధిగమించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన రైతు ముళ్లపూడి సత్యనారాయణ ఓ యంత్రాన్ని ఆవిష్కరించారు. పేటెంట్‌ సైతం పొందారు.
ట్రాక్టరుకు వెనుక భాగంలోని హైడ్రాలిక్‌ బద్దెలలో ఒకదానికి హైడ్రాలిక్‌ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. దాని  లివర్‌ను డ్రైవర్‌ సీటు పక్కన అమర్చారు. దుక్కి, దమ్ము చేసే సమయాల్లో ట్రాక్టరు డ్రైవరు ఈ లివర్‌ను ఉపయోగించి యంత్రాన్ని ఎడమ, కుడి భాగాల్లో ఎక్కువ ఒత్తిడి పెంచి గట్ల వెంట భూమిని సులభంగా చదును చేయడానికి వీలవుతుంది. ఈ యంత్రానికి 2011లో పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయగా.. గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ ఇచ్చినట్లు రైతు వివరించారు. ఈ తరహా ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలో ఇప్పటివరకూ అందుబాటులో లేవని ఉద్యాన, వ్యవసాయాధికారులు తెలిపారు.
ఈ యంత్రం తయారీకి ముళ్లపూడి దాదాపు మూడేళ్లు కృషి చేశారు. హైదరాబాద్‌లో ఓ వర్క్‌షాపు అద్దెకు తీసుకుని మరీ ప్రయోగాలు చేశారు. హైడ్రాలిక్‌ యంత్రం వినియోగంతో ఎకరాకు రూ.1500 వరకూ ఆదా అవుతుందని, పని సైతం సులువుగా ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. భవిష్యత్తులో పత్తితీత యంత్రాన్నీ అందుబాటులోకి తెస్తానని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు