మనువాడిన మనసులు..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనువాడిన మనసులు..

అతడికి కాళ్లూ చేతులూ లేకున్నా.. వాహనం నడపటం దగ్గరనుంచి.. తన పనులన్నీ తానే చేసుకుంటాడు. శ్రావ్యంగా పాటలు పాడతాడు. నోటితో పెన్సిల్‌ పట్టుకుని చిత్రాలు గీస్తాడు. బహుమతులూ గెలుచుకున్నాడు. ఈ నైపుణ్యాలు, అతడి మంచి మనసు చూసి.. క్లాస్‌మేట్‌ అయిన సునీత మనసిచ్చింది. దివ్యాంగుడిని ఎలా చేసుకుంటావంటూ తల్లిదండ్రులు వద్దన్నా.. ఆమె తన ప్రేమను పండించుకుంది. పెద్దల సమక్షంలో మనువాడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్‌కు చెందిన శంకర్‌నాయక్‌కు పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేవు. అతడు జడ్చర్లలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌కు చెందిన సునీత పరిచయమైంది. పాక్షికంగా దివ్యాంగురాలైన ఆమెతో స్నేహం ప్రేమకు దారితీసింది. సునీత డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, శంకర్‌ డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) చేస్తున్నాడు. మేజర్లయిన వీరు పెళ్లితో ఒక్కటవ్వాలనుకోగా సునీత కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తిమ్మాజిపేట పోలీసులను ఆశ్రయించగా వారూ స్పందించలేదు. మరికల్‌ గ్రామ పెద్దలను ఆశ్రయించి.. ఒప్పించారు. గ్రామ సర్పంచి హన్మంతుతోపాటు శంకర్‌ తరఫు బంధువులు, అతి కొద్దిమంది గ్రామ పెద్దల సమక్షంలో బిజినేపల్లి మండలం వట్టెం దేవస్థానంలో బుధవారం వివాహంతో ఒక్కటయ్యారు.

  - న్యూస్‌టుడే, తిమ్మాజిపేట


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు