1.88 కోట్ల పనిదినాలు ఉఫ్‌!
close

ప్రధానాంశాలు

1.88 కోట్ల పనిదినాలు ఉఫ్‌!

మే నెలలో ఉపాధి హామీపై తీవ్ర ప్రభావం
5.7 లక్షల కుటుంబాలు పనికి దూరం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా రెండో దశ ఉద్ధృతి గ[త నెలలో ఉపాధి హామీ పనులపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది మే నెలలో తెలంగాణలోని 25.70 లక్షల కుటుంబాలకు 6.11 కోట్ల పనిదినాలు కల్పించగా.. అదే సమయంలో ఈ ఏడాది 19.93 లక్షల కుటుంబాలు 4.23 కోట్ల పనిదినాలు మాత్రమే వినియోగించుకున్నాయి. అంటే 1.88 కోట్ల పని దినాలు తగ్గాయి. 5.7 లక్షల కుటుంబాలు ఉపాధికి దూరమయ్యాయి. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి గ్రామాల్లో వైరస్‌ వేగంగా వ్యాపించడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఏప్రిల్‌లో కోటి పని దినాలు అధికం
ఈ ఏడాది ఏప్రిల్‌లో 16.95 లక్షల కుటుంబాలకు 3.2 కోట్ల పనిదినాలు కల్పించారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే దాదాపు కోటి పనిదినాలు ఎక్కువ నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 38.72 లక్షల మంది లబ్ధిదారులు ఉపాధిహామీ పనులు చేశారు. వీరికి దాదాపు 7.79 కోట్ల పనిదినాలు కల్పించారు. ఒక్కో కూలీకి పనిచేసిన రోజులకు సగటున రూ.169.39 చొప్పున వేతనం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌, మే, జూన్‌లో మహిళలు 22.09 లక్షల మంది, పురుషులు 16.94 లక్షల మంది ఉపాధి పనులు చేశారు. మహిళల వాటా 57 శాతం ఉంది. సాగు, వరద నీటి కాలువల్లో పూడికతీత పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని