close

కారు నంబరు రూ.132 కోట్లు..!

కారో బైకో కొనుక్కున్నప్పుడు నంబర్‌ప్లేట్‌లో లక్కీ నంబర్లు వస్తే బాగుండునని చాలామందే అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎంత ఖర్చైనా ఆ లక్కీ నంబర్లను దక్కించుకుని తీరతారు. అలా, లక్షలు వెచ్చించి అదృష్ట సంఖ్యల్ని కార్ల నంబర్‌ప్లేట్ల మీదకు తీసుకొచ్చుకున్నారు కొందరు. ఇంతకీ వాళ్లెవరూ... ఆ నంబర్లు ఏంటీ అంటే...

 

తిరువనంతపురానికి చెందిన కె.ఎస్‌.బాలగోపాల్‌ ఈ మధ్య దాదాపు తొంభై లక్షల విలువ చేసే పోషి బాక్ట్సర్‌ కారును కొన్నాడు. అతని లక్కీ నంబర్‌ 1 కావడంతో తన కారు నంబర్‌ కూడా అదే కావాలని ఆర్టీఏ వేలంలో 31 లక్షలకు 1KL 01 CK1 నంబర్‌ను దక్కించుకున్నాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్‌ప్లేట్‌ను కలిగిన కారు యజమానిగానూ బాలగోపాల్‌ గుర్తింపు పొందాడు. అంతేకాదు, రెండేళ్ల క్రితం కొన్న టయోటా లాండ్‌ క్రూజర్‌ కోసం కూడా తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించి కెఎల్‌01 సీబీ1 (KL 01 CB1) నంబర్‌ను చేజిక్కించుకున్నాడు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిన బిల్డర్‌ గోవింద్‌భాయ్‌ 63 లక్షల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌  తీసుకున్నాడు. దానిపై తన అదృష్ట సంఖ్య 7 ఉండాలని దాదాపు 20 లక్షలకు జీజే03 ఎల్‌బీ0007(బిరి03 లితీ0007)నంబర్‌ను సొంతం చేసుకున్నాడు. అలానే చండీగఢ్‌కు చెందిన రైతు, వ్యాపారి అయిన జగ్జీత్‌ సింగ్‌ ఛాచల్‌కూ సంఖ్యాశాస్త్రంపైన నమ్మకం ఎక్కువ. అందుకే ఇష్టంగా కొన్న టయోటా లాండ్‌ క్రూజర్‌పైన తన అదృష్ట సంఖ్య ఒకటి ఉండాలని 17లక్షలకు సీహెచ్‌01 ఎఎన్‌0001 (CH01AN0001) నంబర్‌ను పొందాడు. దాంతోపాటు అతని మరో నాలుగు కార్లకీ ఇదే విధంగా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకున్నాడు.

 

తొమ్మిదేళ్లలో రూ.40లక్షలు
జైపుర్‌కి చెందిన రాహుల్‌ తనేజ టైర్లకు పంక్చర్లు వేస్తూ, ఆటో నడుపుకునే స్థాయి నుంచి వచ్చి బిలియనీర్‌గా ఎదిగాడు. అందుకే ఎక్కడైనా నంబర్‌ 1గా ఉండాలనేది అతని లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే తన కారు నంబర్‌ కూడా అదే ఉండాలనుకున్నాడు. ఈ మధ్య కోటిన్నర పెట్టి కొన్న జాగ్వార్‌కు 16 లక్షల రూపాయల బిడ్‌ వేసి  ఆర్‌జే45 సీజీ1
(RJ 45 CG1) నంబర్‌ను పొందాడు. గత తొమ్మిదేళ్లలో కారు నంబర్లకోసం దాదాపు 40 లక్షలకుపైనే ఖర్చు చేశాడు. తొలిసారి 2011లో బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్‌ కొనుగోలు చేసి దానికి పదిన్నర లక్షలు చెల్లించి ఆర్‌జే 14 సీపీ1 (RJ14CP1) తీసుకున్నాడు. ఆ తరవాత దాన్ని మార్చి 7సిరీస్‌ కారును కొనుగోలు చేసినా మళ్లీ బిడ్‌ వేసి పాత నంబర్‌నే దక్కించుకున్నాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వాసి ఉపేందర్‌ చుడసామా కొనుక్కున్న రేంజ్‌రోవర్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఒకటి రావాలని ఎనిమిదిన్నర లక్షలు వెచ్చించి జీజే03 ఎల్‌బీ0001 (GJ03 LB0001) నంబరు సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య దుబాయ్‌కి చెందిన ప్రవాస భారతీయుడు బల్వీందర్‌సింగ్‌ పదికోట్ల కారు కొన్నాడు. దానికి 60కోట్లు ఖర్చుపెట్టి డి5 నంబరును పొందాడు. అలా బోలెడు డబ్బుపోసి కొనుక్కున్న కార్లకి సెంటిమెంట్‌కోసం అంతంత ఖరీదు పెట్టి నంబరుప్లేట్లు దక్కించుకుంటున్నారంటే మాటలు కాదు.


దాదాపు పదమూడు కోట్ల రూపాయల విలువ చేసే బుగెట్టి వెరాన్‌ కారును ఎంతో మోజుపడి కొన్నాడు బ్రిటన్‌కి చెందిన వ్యాపారవేత్త అఫ్జల్‌ కాహ్న్‌. తన అదృష్ట సంఖ్య 1 వచ్చేలా ‘ఎఫ్‌1’ అనే నంబర్‌ ప్లేటు కోసం 132 కోట్లు ఖర్చు పెట్టి మరీ దక్కించుకున్నాడు అఫ్జల్‌. ‘వామ్మో అంతా...’ అంటూ యావత్‌ప్రపంచం ముక్కున వేలేసుకుంటున్న ఈ నంబర్‌ప్లేటే ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత ఖరీదైంది.

 


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.