రాశిఫలం - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాశిఫలం

గ్రహబలం (నవంబరు 22 -28)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

కాలం సహకరించడం లేదు. విఘ్నాలుఉన్నాయి. ముఖ్యకార్యాలను వాయిదా వేయటం మంచిది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. వ్యాపారంలో ఆటంకాలుంటాయి. మొహమాటం వల్ల సమస్యలొస్తాయి. ఇంట్లోవారి సలహాలు తీసుకోవాలి. ఆర్థికస్థితి మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం మంచిది.


అనుకూల కాలమిది. సకల శుభాలు చేకూరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలసివస్తుంది. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో విజయం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో మేలు చేకూరుతుంది. ఆదిత్యహృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. సంపదలు సమకూరుతాయి. సాహస కార్యాల్లో పురోగతి ఉంటుంది. భూలాభం చేకూరుతుంది. వ్యాపారపరంగా శ్రమ పెరుగుతుంది. ఆర్థికస్థితి బాగుంటుంది. బంధుమిత్రులతో చర్చలు సఫలమవుతాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.


శ్రేష్ఠమైన కాలమిది. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. అదృష్టయోగం ఉంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. లక్ష్మీకటాక్షసిద్ధి ఉంది. అద్భుతమైన అవకాశాలు వస్తాయి, సద్వినియోగం చేసుకోవాలి. మీవల్ల నలుగురికీ మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరించండి, ప్రశాంతత చేకూరుతుంది.


ప్రయత్నాన్ని కొనసాగిస్తే చక్కటి విజయం ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ పెంచాలి. ఆస్తి పెరుగుతుంది. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. వివాదాలకు సమయం కాదు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.


అదృష్టయోగముంది. ఎటుచూసినా లాభమే గోచరిస్తోంది. ఉద్యోగం శుభప్రదం. అభీష్టసిద్ధి ఉంటుంది. గృహ, భూ లాభాలుఉన్నాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వ్యాపారంలో కలసి వస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభాన్నిస్తుంది.


ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో తెలియని ఆటంకాలున్నాయి. ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకోండి. మిత్రుల వల్ల పనులు అవుతాయి. సమయాన్ని బట్టి నడచుకోవాలి. శ్రమ పెరిగినా లాభం ఉంటుంది. మంచి మాటలు వింటారు. సూర్యస్తుతి మేలు చేస్తుంది.


ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అందుకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. వ్యాపారంలో విఘ్నాలున్నాయి. స్వయంగా పనులు చేసుకుంటే మంచిది. ఖర్చు పెరుగుతుంది. కుటుంబసభ్యుల సూచనలు అవసరం. మొహమాటంతో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. క్రమంగా అభివృద్ధి సూచితం. నవగ్రహధ్యానం శక్తినిస్తుంది.


శుభ యోగముంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పైకి వస్తారు. వ్యాపారంలో విజయం ఉంటుంది. అంచలంచెలుగా వృద్ధి చెందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. ఆంజనేయస్వామిని దర్శించండి, ఆపదలు తొలగుతాయి.


అదృష్టఫలాలు అందుతాయి. అధికార లాభం ఉంది. వ్యాపారంలో మిశ్రమ కాలం. బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో కొన్ని శుభాలు జరుగుతాయి. ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


విశేష శుభాలున్నాయి. విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంది. వ్యాపారంలోనూ శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంటుంది. భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తారు. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆనందించే అంశాలున్నాయి. ప్రశాంత జీవితం లభిస్తుంది. ధైర్యంగా ఆలోచించాలి. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.


అదృష్ట యోగం మొదలైంది. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా పైకి వస్తారు. కృషి ఫలిస్తుంది. లాభనష్టాలకు అతీతంగా పనిచేసి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందే కాలమిది. సహనం చాలావరకు కాపాడుతుంది. సూర్యనారాయణమూర్తిని స్మరించండి, శక్తి పెరుగుతుంది.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు