close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడో ధ్రువమూ ఉంది!

త్తర, దక్షిణ ధ్రువాలు రెండే అని మనకు తెలుసు. కానీ థర్డ్‌ పోల్‌ అని ఒక ప్రాంతాన్ని అంటారు. అది మన దేశ సరిహద్దులోనే ఉంది. హిమాలయ- హిందుకుష్‌ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూడోధ్రువమని అంటారు. ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఉండనంత ఎక్కువ మంచు ఇక్కడ నిల్వ ఉంటుంది. చుట్టూ ఉన్న పర్వతాల మీది నుంచి ఆ మంచు కరిగి తయారైన స్వచ్ఛమైన నీరు అక్కడి నుంచి కిందికి ప్రవహిస్తుంటుంది. ధ్రువ ప్రాంతాల తర్వాత ఎలాంటి కాలుష్యాలూ లేని శుభ్రమైన నీరున్న ప్రాంతం ఇదొక్కటే. పది ప్రధాన నదులు ఇక్కడి నుంచే పుడతాయి. ప్రపంచంలో నాలుగో వంతు ప్రజలకు తాగు, సాగు నీళ్లతోపాటు విద్యుత్‌ ప్రాజెక్టులకు కూడా ఈ నదులే ఆధారం. ఆ నీటితో పండే పంటలే మూడు వందల కోట్ల ప్రజలకు తిండిపెడుతున్నాయి. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో వాతావరణ మార్పులకు లోనవుతున్న ప్రదేశమూ ఇప్పుడు ఇదేనట. ప్రపంచమంతటా ఈ శతాబ్దాంతానికి ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరుగుతుందన్నది అంచనా అయితే ఇక్కడ మాత్రం మూడున్నర నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందట. దాని ప్రభావం నదుల మీదా, ఆ నదుల పరివాహ ప్రాంతాల్లో నివసించే ప్రజల మీదా పడుతుంది కాబట్టి థర్డ్‌ పోల్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలపై పరిశోధన చేయిస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు