ఎంత అన్యాయం! - Sunday Magazine
close
ఎంత అన్యాయం!

భార్య: అవునండీ, మనం పోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ మీకు అప్సరసలు ఉంటారట కదా... మరి మా ఆడవాళ్లకు ఎవరుంటారు..?
భర్త: (వెటకారంగా) కోతులు
భార్య: ఎంత అన్యాయం... మీకేమో ఇక్కడా అక్కడా కూడా అప్సరసలు దొరుకుతారు, మాకేమో రెండు చోట్లా కోతులేనా... ఇదేం ఖర్మ...!


దీనికింత గోలా!

ముగ్గురు ఇంజినీర్లు ఒక వంగివున్న పైపులోకి ఒక వైరుని దూర్చుతున్నారు. అయిదు రోజులనుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇదంతా ఒక రైతు చూసి ‘‘సార్‌, ఒక్కసారి నన్ను చూడమంటారా’’ అన్నాడు.
ఇంజినీర్లు నవ్వి ‘‘సరే ప్రయత్నించు’’ అన్నారు.
రైతు తన పొలంలోకి వెళ్లి ఒక ఎలుకను తీసుకువచ్చి దాని తోకకి వైరును కట్టి పైపులోకి వదిలాడు. ఆ ఎలుక రెండోవైపు నుంచి బయటకి వచ్చింది. అంతే! ఇంజినీర్లు మూర్ఛపోయారు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న