బడ్జెట్ ధర..5K బ్యాటరీ..రెడ్‌మీ కొత్త ఫోన్
close

Published : 15/09/2020 16:40 IST
బడ్జెట్ ధర..5K బ్యాటరీ..రెడ్‌మీ కొత్త ఫోన్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్‌తో అదరగొడుతున్న రెడ్‌మీ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెడ్‌మీ 9 సిరీస్‌లో భాగంగా 9ఐ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 9, 9ఏ, 9 ప్రైమ్‌ మోడల్స్‌ సందడి చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ మార్కెట్‌ లక్ష్యంగా రెడ్‌మీ  9ఐను తీసుకొచ్చారు. బడ్జెట్‌ ధర, పెద్ద బ్యాటరీ, నాచ్‌డ్‌ డిస్‌ప్లే, సింగిల్ కెమెరా వంటివి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు.

రెడ్‌మీ 9ఐ ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.53 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ25 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రెండు కెమెరాలు ఉన్నాయి. వెనక వైపు 13 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ ఏఐ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 8,299గాను, 4జీబీ ర్యామ్‌/128జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ.9,299గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌, ఎంఐ హోం స్టోర్లలో ఫోన్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. మిడ్‌నైట్‌ బ్లాక్‌, సీ బ్లూ, నేచర్‌ గ్రీన్‌ రంగుల్లో 9ఐ లభిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న