లైవ్‌ ఆడియో రూమ్స్‌ లాంచ్ చేసిన ఫేస్‌బుక్‌
close

Published : 22/06/2021 00:10 IST
లైవ్‌ ఆడియో రూమ్స్‌ లాంచ్ చేసిన ఫేస్‌బుక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది మార్చిలో ఐఓఎస్‌ వినియోగదారులకోసం అందుబాటులోకి వచ్చిన ఆడియో బేస్డ్‌ సోషల్‌ మీడియా యాప్‌ క్లబ్‌హౌస్‌ సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్నాళ్లకే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలకు గట్టి పోటీని ఇచ్చింది. మొన్నటి వరకూ ఐఓఎస్‌కే పరిమితం అయిన క్లబ్‌ హౌస్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఈ ఏడాది మే 22న అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో ఇతర సామాజిక మాధ్యమాల రూపకర్తలు క్లబ్‌ హౌస్‌కు దీటుగా నిలబడేందుకు లైవ్‌ ఆడియో రూమ్‌ ఫీచర్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించారు.

ఇప్పటికే ట్విట్టర్‌ ‘స్పేసెస్‌’, స్పూటిఫై ‘గ్రీన్‌ రూం’  ద్వారా క్లబ్‌హౌస్‌ తరహా ఫీచర్లను తమ యూజర్లకు అందిస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ కూడా క్లబ్‌హౌస్‌ తరహాలో లైవ్‌ ఆడియో రూమ్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమెరికాలో ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 50 మంది వక్తలు, అపరిమిత శ్రోతలు ఈ లైవ్‌ ఆడియో రూమ్స్‌లో పాల్గొనవచ్చు. ఐఓఎస్‌ యూజర్‌ ఇన్విటేషన్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు కూడా ఈ ఆడియో రూమ్స్‌లో జరిగే సమావేశాలను వినవచ్చు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న