Nokia Smartphones: వాటర్‌ప్రూఫ్‌ ఫీచర్‌తో నోకియా కొత్త ఫోన్
close

Published : 28/07/2021 00:27 IST
Nokia Smartphones: వాటర్‌ప్రూఫ్‌ ఫీచర్‌తో నోకియా కొత్త ఫోన్

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా బ్రాండ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా ఎక్స్ఆర్‌ 20 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో వాటర్‌ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ఎక్స్‌ఆర్‌ 20తో పాటు నోకియా ఎంట్రీ-లెవల్‌ సెగ్మెంట్‌లో సీ30 మోడల్‌ను, ఫీచర్ ఫోన్ శ్రేణిలో నోకియా 6310 మోడల్‌ను విడుదల చేసింది. మరి ఈ ఫోన్ల ధరెంత..ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 


నోకియా ఎక్స్ఆర్‌ 20

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అలానే తడి చేతులతో ముట్టుకున్నా పనిచేసేలా ఈ డిస్‌ప్లేని డిజైన్ చేశారు. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌లో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇందులో స్పీడ్‌వ్రాప్‌, యాక్షన్ క్యామ్ మోడ్స్ ఇస్తున్నారు. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 1.8మీటర్ వాటర్ డ్రాప్స్ పడినా, గంటసేపు నీటిలో తడిచినా పాడవకుండా వాటర్ రెసిస్టెంట్ రక్షణ కల్పించినట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ చెబుతోంది. 4,630 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ వైర్, 15వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. నోకియా ఎక్స్ఆర్‌ 20 మోడల్‌ని 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో తీసుకొచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర 499 యూరోలు. మన కరెన్సీలో సుమారు రూ. 43,800. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. 


నోకియా సీ30 

సీ30 ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.82-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ యూనిసాక్‌ ఎస్‌సీ9863ఏ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 13ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా అమర్చారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీతో వస్తున్న ఫోన్ ఇదే. నోకియా సీ30ని మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. 2జీబీ ర్యామ్‌/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌/32జీబీ, 3జీబీ ర్యామ్‌/64జీబీ. దీని ప్రారంభ ధర 99 యూరోలు. భారత కరెన్సీలో సుమారు రూ. 8,700.


నోకియా 6310

ఈ ఫోన్‌లో 2.86-అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నేక్ గేమ్‌, ఎల్‌ఈడీ టార్చ్, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లున్నాయి. యూనిసాక్ 6531ఎఫ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 0.3ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 1,150 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ ధర 40 యూరోలు. మన కరెన్సీలో సుమారు రూ.3,500. త్వరలోనే ఈ మోడల్స్‌ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న